Neeve Lyrics

Lyrics & meaning

Neeve

Sameera BharadwajYazin Nizar

ReleasedOctober 21, 2016 GenreIndian

Choose your script

Read the Song Lyrics

Lyrics text size: 100%

నీవే
తొలి ప్రణయము నీవే
తెలి మనసున నీవే
ప్రేమ ఝల్లువే
నీవే నీవే

కలలు మొదలు నీవల్లే
మనసు కడలి అలలు నీవల్లే
కనులు తడుపు నీవే
కలత చెరుపు నీవే
చివరి మలుపు నీవే
నీవే ఎటు కదిలిన నీవే
నను వదిలిన నీవే
ఎదో మాయవే
ప్రేమే మది వెతికిన నీడే
మనసగిడిన తోడే నా జీవమే

నిలువనీదు క్షణమైనా వదలనన్న నీ ధ్యాస
కలహమైన సుఖమల్లే మారుతున్న సంబరం
ఒకరికొకరు ఎదురైతే నిమిషమైన యుగమేగా
ఒక్కోసారి కనుమరుగై ఆపకింక ఊపిరి
నీవే గచిడిన కథ నీవే
నడిపిన విధి నీవే నా ప్రాణమే
పాదం వెతికిన ప్రతి తీరం
తెలిపిన శశి దీపం నీ స్నేహమే

నీ జతే విడిచే ఊహ నే తాళనులే
వేరొక జగమే నేనిక ఎరుగనులే
గుండెలోని లయ నీవే
నాట్యమాడు శ్రుతి నేనే
నువ్వు నేను మనమైతే అదో కావ్యమే
నీవే నను గెలిచిన సైన్యం
నను వెతికిన గమ్యం
నీవే నా వరం
ప్రేమే
తొలి కదలికలోనే మనసులు ముడివేసే
ఇదో సాగరం